అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు… తెలుగులో

అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు… తెలుగులో కోట్స్… మే9న అంతర్జాటేయ మాతృదినోత్సవం. ఆ సందర్భంగా ధరణిలోని అందరి అమ్మలకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

బిడ్డకు జన్మనిచ్చే స్త్రీ మరలా పునర్జన్మ పొందుతుంది. భూమిపైకి మరొక జీవి పుట్టుకకు అమ్మ మరణయాతనను అనుభవిస్తుంది. ఇంకా అమ్మ బిడ్డడి మలమూత్రాలను ఎత్తుతుంది.

అమ్మ తన పుత్రుడు కోసం చేసే సేవ, సృష్టిలో మరే ఇతరులు చేయలేరు. అమ్మకు సహజంగా పరిపూర్ణమైన ప్రేమ బిడ్డపై ఉంటుంది. అమ్మ ఆప్యాయత అనంతం.

మాతృత్వం కోసం అమ్మ పడే తపన పడుతుంది. ఎంత పెద్ద కష్టం అయినా భరిస్తుంది, అమ్మను మించిన దైవం ఉండదు.
అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

రాముడైన, కృష్ణుడైన అమ్మఒడిలో లాలిపాటలు విన్నవారే…

అమ్మకు దైవము అయిన రాక్షసుడు అయినా ఒక్కటే… అందుకే అమ్మకు ఎవరు పుట్టినా ప్రేమించదమే తెలుసు… పుట్టినవారు మంచి పేరు సంపాదించాలనే కోరుకుంటుంది… అమ్మ! అయినా అమ్మ మనసు మరిచిన మనిషి కాలం మాయలో పడి జీవనగమ్యం మరిస్తే…

అయినా అమ్మ బిడ్డడిని ప్రేమిస్తూనే ఉంటుంది… మృదువుగానే మాట్లాడుతుంది… అటువంటి అమ్మలను గన్న అమ్మలకు, అమ్మమ్మలకు… అమ్మమ్మలను గన్న అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు… తెలుగులో కోట్స్

అమ్మకు అన్నీ బిడ్డడే, బిడ్డకు అన్నీ అమ్మే… అమ్మ అప్యాయతకు ఆకాశమే హద్దు అయితే, బిడ్డడి భయానికి అమ్మఒడి శ్రీరామరక్ష… రక్షణకు మారుపేరు మాతృమూర్తి… తల్లులందరికి…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

అమ్మ అంటే లోకువ ఎందుకంటే ఎంత అల్లరి అయినా భరించేది… అమ్మ మాత్రమే… అల్లరిని అదుపులో పెట్టడంలో అమ్మ పెద్ద స్నేహితురాలు… స్నేహమూర్తి నా మాతృమూర్తికి…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

మన భారతదేశానికి సంప్రదాయ దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందటే, మన భారతీయ స్త్రీలే కారణం అటువంటి స్త్రీ మూర్తులందరికి…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

మనిషిగా పుట్టడమే అదృష్టం అయితే, అటువంటి అదృష్టం నాకు కలుగజేయడానికి మృత్యువుతో పోరాటం చేసే మాతృమూర్తులందరికి…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

నన్ను కన్న నా తల్లి నీ రుణం తీర్చుకోలేను, నీకు రోజు నమస్కారం, స్త్రీలోకానికి సంస్కారంతో నమస్కారం

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

నవమాసాలు నన్ను కడుపులో మోసి, నన్ను కనేటప్పుడు నీవు పడ్డ మరణయాతనకు ఫలితం నేనుగా లోకంలో ఉన్నాను. అమ్మా ఈ జీవితాంతం చెడ్డపేరు తెచ్చుకోకుండా బ్రతకడమే, నీ కష్టానికి ప్రతిఫలితం అయితే, కచ్చితంగా చెడుకు దూరంగా, మంచికి దగ్గరగా బ్రతుకుతాను.

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అమ్మకు ఓ మంచి మాట చెబుతూ… నీ కొడుకు

రాముడిని కన్నవారు, కృష్ణుడిని కన్నవారు చాలా గొప్పవారు అంటారు. కానీ అమ్మా నన్నుకన్ననీవు మాత్రం నాకు చాలా చాలా గొప్ప… ఎందుకంటే ఒక సామాన్యుడిగానే పుట్టినా, నన్ను అసామాన్యుడిగా మార్చిన నా తల్లీ….

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఒక్క రోజే కాదు ప్రతిరోజు నీపాదాలకు నా నమస్కారములు…

నాకు సమాజంలో లభిస్తున్న గౌరవం తండ్రిది అయితే, నేను అనేవాడు పుట్టుకకు నీకు మరణయాతన మూలం. అటువంటి యాతన పొంది నన్ను కన్నతల్లీ...

నీకు ప్రతిరోజు నమస్కారం… ప్రతి అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

వీరుడైనా… శూరుడైన శత్రువు ఎవరో తెలుసుకుని గెలుపు అంచనాతో యుద్దం చేస్తాడు కానీ ప్రాణాపాయ స్థితికి కొనితెచ్చుకోడు. కానీ అమ్మ ఎటువంటి తత్వంతో జీవి పుడతాడో తెలియదు… పుట్టినవారు లోకంలో ఎటువంటి వారుగా మారుతారో తెలియదు. అయినా నన్ను కనడానికి మాత్రం నీవు ప్రాణాపాయ స్థితిని ఇష్టపడి కొనితెచ్చుకుంటావు… నన్ను కన్న నా తల్లీ…

ఈ ఒక్కరోజే కాదు ప్రతి రోజు మాతృమూర్తికి అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ఇష్టపడితే కష్టం కూడా ఆనందమే ఉంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ అమ్మ ప్రసవవేదనే…. అటువంటి ప్రసవవేదనే ప్రకృతి పర్యావరణంలో కీలకం…. మాతృమూర్తులందరికి…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

స్త్రీకి అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ఎక్కడైనా సంస్కారం లోపించినా, స్త్రీ దగ్గర సంస్కారం లోపించకుండా ఉండడమే పురుషలక్షణం అయితే, ప్రతి స్త్రీలోని మాతృత్వం చూసే మహాత్ములను కన్న అమ్మలకు ఆ అమ్మలను కన్న అమ్మలకు ఇంకా అందరి అమ్మలకు…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

కష్టంలో స్త్రీ అమ్మగానే మారుతుంది. ఎందుకంటే అమ్మతత్వం స్త్రీలో సహజంగా ఉంటుంది. అందుకే అందరితోనూ అమ్మలాగానే మాట్లాడుతుంది… మాతృత్వం స్వభావం సహజంగా కలిగిన స్త్రీలందరికి…

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ఈర్శ అనే ఒక గుణం లేకపోతే, లోకం అంతా స్త్రీపాదాల దగ్గరే ఆగిపోతుందని భావించి బ్రహ్మ ఈర్శ గుణాన్ని సృష్టించి ఉంటాడు. ఎందుకంటే అమ్మప్రేమ కన్నా అమృతం ఏమి ఉంటుంది. ఆ అమృతం ప్రతి స్త్రీలోను సహజం… కాబట్టి…

ప్రతి స్త్రీకి అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

మనిషి తలచుకుంటే దేవుడిని ప్రత్యక్షం చేసుకోగలడు కానీ అటువంటి మనిషి పుట్టాలంటే స్త్రీ ప్రసవవేదన పడవలసిందే… ఏదైనా సాధించగలిగే సాధకులను కానే స్త్రీమూర్తులకు….

అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

తెలుగులో శుభాకాంక్షలు

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు