అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో….

అమ్మ పరదేవతకు ప్రతిరూపంగా చెబుతారు. అమ్మ త్యాగం ముందు ఎవరు ఏమి చేసినా అది తక్కువే అవుతుంది. అమ్మ అంటే అమ్మే… అమ్మ ప్రేమకు అమ్మ ప్రేమే సాటి.

రూపం చూసి ప్రేమించే పాత్రలు ఎన్నో కనబడతాయి. ఒక ప్రాణానికి రూపమిచ్చే తల్లి మనసు మిన్న. తన తనయ లేక తనయురాలు రూపమెలా ఉన్నా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు.

బిడ్డ కడుపు చూసే అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కొన్ని కోట్స్….

నా జననం నీ పోరాటం, నా జీవితం నీ కష్టం… ఇష్టంతో కష్టం స్వీకరించిన నా తల్లికి…

నీకు జన్మదిన శుభాకాంక్షలు.

అమ్మా నీ గురించి చెప్పడానికి భాష సరిపోవడం లేదు, చెప్పాలన్న ఆశకు హద్దు ఉండడం లేదు.

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంశాలు..

పలికి పలకలేని పెదవులకు భాష పలికించే తొలిగురువు అమ్మ… నా ప్రావీణ్యానికి పునాది నీ ఒడి తల్లి…

నీకు జన్మదిన శుభాకాంక్షలు.

రాముడు గురించి రామాయణం, కృష్ణుడి గురించి భాగవతం, నీ గురించి నా జీవితం తెలియజేస్తూ ఉంటాయి…

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంశాలు..

నాకు ప్రాణం పోయడానికి నీ ప్రాణాలు మీదకు తెచ్చుకున్నావు తల్లి… అమ్మా నీ పాదాలకు నా నమస్కారం.

మా అమ్మకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు

కోటిమంది వైద్యులు కూడి వచ్చినా మరణమన్న వ్యాధి మాన్పలేరు… కానీ నేడు నేను ఉన్నానంటే కారణం నీవేనమ్మా…

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంశాలు..

ఎన్నిసార్లు నన్ను రక్షించావో, అన్నిసార్లు నేను తిరిగి పుట్టినట్టు అయితే, ఈ జీవితం నీ సృష్టి…

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంశాలు..

అమృతం దేవతల సొత్తు అయితే, అమ్మా అమృతం కన్న మిన్న అయిన నీ ఆప్యాయత నాకు సొంతం.

అమ్మకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నీవు చెప్పిన నీతికధల ఫలితమే, నా జీవిత లక్ష్యం అయ్యింది. అటువంటి లక్ష్యం ఏర్పరచిన

తల్లీ నీకు జన్మదిన శుభాకాంక్షలు.

అందలం అందుకున్నవాడు అయినా అట్టడుగున ఉన్నవాడు అయినా అమ్మకు ఎవరైనా ఒక్కటే…

అమ్మకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు.

అద్భుతమేదైనా అమ్మ ప్రేమ ముందు కనుమరుగు…

అమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగులో

యోధులు సైతం తమకు సమఉజ్జిలతో పోరాటం చేస్తారు కానీ అమ్మ నన్ను కనడానికి నీవు మృత్యువుతో పోరాటం చేసిన అమ్మకు…

అమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగులో

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్