అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కోట్స్ తెలుగులో

అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నర్సులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగులో కోట్స్.

హాస్పిటల్ నందు రోగికి వైద్యం చేసే డాక్టర్ తో బాటు ఉండే నర్సుల సేవ కూడా గొప్పది. రోగి పరిస్థితిని బట్టి సేవలు చేస్తూ ఉంటారు.

వైద్యవృత్తిలో నర్సుల సేవలు చాలా కీలకమైనవి. వైద్యచికిత్స పొందుతున్న రోగికి క్రమపద్దతిలో మెడిసిన్ అందజేసే నర్సుల వలన రోగి త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువ.

మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన సేవలను ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు.

నర్సుల దినోత్సవం రావడానికి కారణమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 సంవత్సరం మే నెలలో 12వ తేదీన ఇటలీ దేశంలో జన్మించింది.

ఫ్లోరెన్స్ నైటింగేల్ లండన్‌ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా 1853లో చేరారు. ఆ తరువాత నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది.

‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ అనే పుస్తకాన్ని1859లో నైటింగేల్‌ ప్రచురించారు.

ప్రపంచంలో మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా ఆమె స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌’ ఆమె పుట్టిన రోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరపాలని ప్రకటించారు.

అలా 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజూ మే నెల 12వ తేదీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించబడింది.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కోట్స్ తెలుగులో

అంతో ఇంతో సాయం కాదు అవసరం అయితే ప్రాణాలు నిలబడే సాయం నర్సు రూపంలో లభిస్తుందని అంటారు…. నర్సుగా సేవలందించే అందరికీ…. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు.

బిడ్డకు అమ్మ సర్వస్వం అయితే అలాంటి అమ్మలకు సేవలు చేసే నర్సుల సాయం మరువలేనిది… అలాంటి నర్సులందరికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు.

నర్సు చేసే సేవతో బాటు, నర్సు మాటలు రోగికి మరింత మనో ధైర్యం…… అలాంటి నర్సులందరికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు.

తెలుగులో శుభాకాంక్షలు

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు