కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

కన్న కొడుకులో కన్నయ్య కనబడతాడు. కన్న కొడుకులో కన్నయ్యనే చూస్తూ సంతోషిస్తారు. ఇక కన్నయ లాంటి కన్నకొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ కొన్ని….

నా దారి రహదారి అంటే దారి, .దారిలో ముళ్ళు ఉండవచ్చు, కానీ మన దారి రహదారి అంటే ఆ దారి పూలదారి అవుతుంది. కలుపుకుపోవడం అలవాటు చేసుకో….

జన్మదిన శుభాకాంక్షలు…

పొగిడేవారిని పొగడనివ్వు, ద్వేషించేవారిని ద్వేషించనివ్వు… అవి వారి వారి భావాలు అయితే అందుకు నీవు కారణం అయితే, నిన్ను నీవు పరిశీలించుకో కానీ వారి భావాలను మోస్తూ, బ్రతుకు భారం చేసుకోకు… విలువైన జీవిత లక్ష్యం చేరుకోవాలని కోరుతూ…

పుట్టిన రోజు శుభాకాంక్షలు

నేను పుట్టినప్పుడు నా అమ్మా నాన్న ఎంత ఆనందించారో నాకు తెలియదు కానీ నీవు పుట్టాక, వారు ఎంత ఆనందించారో నాకు తెలుస్తుంది… ఓ నా కొడకా నీవు నిండు నూరేళ్ళు ఆయురారురోగ్యలతో సంతోషంగా ఉనాలి

నా ప్రియా పుత్రా నీకు జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమానందమాయే మనసంతా ఆనందమయే, నీపుట్టుకతోనే ఆనందం అవధులు దాటింది… బిడ్డ భవిష్యత్తులో మాకు కలిగిన ఆనందం నీకు ప్రతిరోజూ కలగాలని కోరుకుంటూ

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎదుగుతున్న కొద్ది, ఒదిగి ఉంటూ అందరితో మంచి అనిపించుకుంటూ జీవితం సంతోషమయంతో సాగాలని ఆశిస్తూ…

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

జీవితం ఆశలమయం అయితే, ఆశయంతో సాగే జీవితం ఉత్తమ జీవితం. సదాశయంతో సదా వర్ధిల్లాలని కోరుకుంటూ

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

గొప్ప ఆశయం పుట్టిన రోజు నిజమైన పుట్టిన రోజు అంటారు. మంచి ఆశయం గురించి ప్రయత్నం చేయడం పురుషలక్షణం. ఆశయంవైపు ఆలోచించే

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మా కలలకు ప్రతిరూపం నీవు, నీ కలలకు మా కలలు అడ్డురావు. నీ కలల సాధనకు సాధన చేస్తూ జీవితం సార్ధకం చేసుకోవాలని కోరుకుంటూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నాతో నడక నేడ్చుకున్నావు, నాదారిలో నడిచావు. నా ఆశయం నీకు ఆశగా మారిపోయింది… నా బాద్యతను బరువుగా భావించని

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

ఎంత సాధించినా గర్వం తలకెక్కకపోవడమే నిజమైన సాధన. అటువంటి గుణం కోల్పోకుండా కలకాలం వర్ధిల్లు…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఆయురారుగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించు నాయనా… నీకు నా అశ్వీరదములు

.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కాలంలో కష్టాలు కలగకమానవు… కవునా కష్టం కూడా …ఇష్టంగా ఎదుర్కోవడం అలవాటు చేసుకో… జీవన పోరాటంలో నీకు విజయం లభించుగాక..

… .. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఎదుగుదల ఉన్న కొలది శత్రుమిత్రులు ఉంటారు…. వారిని గుర్తించడంలోనే సగం గెలుపు. నీకు గల సద్గుణాలు ప్రకాశించాలని దీవిస్తూ…

. … .. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఆశ కొలది ఆలోచనలు, కోరిక కొలది కష్టాలు ఉంటే, ఎక్కువ పని తక్కువ ఆలోచనకు ఆస్కారం. అర్ధవంతమైన ఆలోచనతో సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించు.

… .. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం