కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో

కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో... వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగులో

నిండు నూరేళ్ళు మీ దాంపత్యం సుఖసంతోషలతో సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దంపతులిద్దరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.

అవధులు లేని ప్రేమానుబంధం మీ సొంతం. అయినా అందరిముందు అందమైన ప్రవర్తనతో ఉండే మీ కాపురం కలకాలం సుఖసంతోషలతో కొనసాగాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

చూడముచ్చటగా చాలా జంటలు ఉండవచ్చు. కానీ ఒక్క మనసే ఇద్దరిలో ఉండడం అంటే అది మీఇద్దరినీ చూస్తే కనిపిస్తుంది. మీ సంసారం సుఖసంతోషలతో సాగాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

భూమికి ఉండే ఓర్పు, మేరు పర్వతానికి ఉండే గాంభీర్యం భార్యభర్తలైతే అది మీరు… మీ కాపురం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

అబద్దాలు అందంగానే ఉంటాయి, అందరినీ ఆడిస్తాయి. కానీ మీ మధ్యలో ఇమడలేకపోయాయి. మీ దాంపత్యం ఆదర్శవంతమైన జీవనం. ఇలాగే మీ దాంపత్యం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

సంతోషంగా ఉన్నప్పుడే కాలం వేగంగా కరిగిపోతుంది. నూరేళ్ళ జీవితనికి పునాది ఏర్పడిన రోజు అప్పుడే సంవత్సరం అయ్యింది… అంటే మీ సంసారం ఎంత సంతోషంగా సాగిందో… అలాగే నూరేళ్ళు మీ సంసారం సాగాలని ఆశిస్తూ… కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

ఎప్పుడూ సంతోషం కాలం ఇవ్వదు… కానీ ఒక్కరోజున ప్రారంభం అయిన నూరేళ్ళు కలిసి ఉండే సంసారంలో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడం అంటే మీ మనసులు ఎంతగా కలిసిపోయాయో అర్ధం అవుతుంది. ఆదర్శవంతమైన సంసారం సాగిస్తున్న మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

ఆహ్లాదకరమైన జీవనమే అందమైన జీవితం అయితే, అటువంటి అందం మీ దాంపత్యంలోనే కనబడుతుంది. మీకు కాపురం కలకాలం సుఖసంతోషలతో కొనసాగాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

అర్ధనారీశ్వరులు అంటే ఇద్దరూ ఒకే మనసును కలిగి ఉండడం అంటారు. అదే అడిదంపతుల సంసారం.. అయితే మీరు అది దంపతులవలె కలిసిమెలిసి జీవనం సాగించాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

మీ ఇద్దరినీ చూస్తుంటే కొత్త జంటగా కనబడతారు. కానీ మీతో మాట్లాడితే మీరు ఏనాటి జంటో అనిపిస్తుంది… మీ సంసారం సుఖవంతంగా కలకాలం కొనసాగాలని ఆశిస్తూ కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.

ఆనందానికి హద్దు లేదు. సంసారంలో చిరుకోపలకు కొదువ ఉండదు. ఏదైనా కలిసి జీవనం కొనసాగించాలనే కాంక్ష ముందు కష్టం కరిగిపోతుంది… మీ సంసారం సంతోషంతో సాగాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ఆచారంలో సంప్రదాయం కలిసి ఉంటే, ఆచరణలో మీరు సీతారాముల వంటివారు… మీకు పోలిక చెప్పడం కన్నా మీరు మీలాగానే కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసే కొట్స్ తెలుగులో

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

telugureads

1 thought on “కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో”

Leave a Comment