కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

అమ్మాయి అనగానే అమ్మో అనుకునేవారు, అమ్మాయి అంటే మహాలక్ష్మి అనుకునేవారు ఉంటారు. కానీ పెద్దలు అంటారు. అమ్మాయి అంటే మహాలక్ష్మే అని.

అటువంటి అమ్మాయికి తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొన్ని పదాలతో కలిసిన భావాలు.

కూతురు అంటే కన్నవారికి భారమంటారు కానీ నీవు నన్ను ఉద్దరించడానికి అవతరించిన లక్ష్మిదేవివి…

నా కూతురుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

నీవు అమ్మా అంటుంటే, మా అమ్మే నన్ను అమ్మ అంటున్నట్టుగా అనిపిస్తుంది…

చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నా చిట్టి తల్లీ ఇంట్లో నడుస్తుంటే, శ్రీమహాలక్ష్మి ఇంట్లో నడిచినట్టే ఉంటుంది.

నీకు జన్మదిన శుభాకాంక్షలు

అమ్మ అయినా, అమ్మమ్మవు అయినా నాకు చిట్టి తల్లివే నీవు… నా బంగారు తల్లి నీకు జన్మదిన శుభాకాంక్షలు.

జన్మదిన శుభాకాంక్షలు.

నీ కంటతడి నా గుండెల్లో సాగరం అవుతుంది. నా చిట్టితల్లి జీవితం నిత్య సంతోషమయం అవ్వాలని ఆశిస్తూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఈ ఇంట సిరులొలికించావు… ఆ ఇంట సంతోషం నింపావు. పుట్టింట్లోనూ మెట్టింట్లోనూ ఆనందాన్ని అందిస్తున్నా చిట్టితల్లికి

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నీవు నవ్వుతున్నంత కాలం సిరులోలికే సమయం. నీవు నడిచిన ఇల్లు ఆనందమయం. నా చిట్టి తల్లి అదృష్టానికి ఆలవాలం….

కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

జగదంబ అందరికీ అమ్మగా ఉంటుంది. కానీ కూతురుగా కొందరికే పరిమితం. నా చిట్టి తల్లి నీకు

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్