ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు, తెలుగులో విషెస్ కొట్స్.

జీవితం కాలంలో పరిగెడుతూ ఉంటుంది. కష్టం, నష్టం అనే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా జీవితం కాలంతో బాటు సాగిపోతుంది. కాలంలో పరుగు పెట్టె జీవితం గెలుపు కాలమే తెలుపుతుంది. బౌతికంగా మనిషి పెట్టె పరుగు ఏదో ఒక లక్ష్యాన్ని చేరడానికే నిర్ధేశింపబడి ఉంటుంది. మొత్తానికి మనిషి పరుగు పెడుతూనే ఉంటాడు.

ఆటలలో పరుగు పందెం వ్యక్తిలో విజయ కాంక్షను రేపుతుంది. పరుగు పందెంలో పాల్గొని గెలవడానికి పరిగెత్తడం సాధన చేస్తూ ఉండే వ్యక్తికి విజయతీరం చేరాలనే తపన ఉంటుంది.

ఆటలు ఆడేవారికి గెలుపు, ఓటములు మంచి పాఠాలు నేర్పుతాయి. వారిలో ఓర్పు కూడా పెరుగుతూ ఉంటుందని అంటారు. క్రీడా స్పూర్తి అభివృద్ది చెందుతుంది.

ఆసక్తితో ఆడే ఆట, సాధన చేస్తే విజయం వైపు వెళ్ళడం అంత కష్టమేమీ కాదు.

పరుగుపందెం, జంపింగ్, త్రోయింగ్, వాకింగ్ వంటి ఆటలు అథ్లెటిక్స్ కేటగిరీలో ఉంటాయి.

ఆటలలో గొప్ప కీర్తి సంపాదించినవారు మరొకరికి ఆదర్శం అవుతారు. వారు సాధించినంత కీర్తిని తాము సాధించాలనే తపనపడతారు.
ఎదిగే వయస్సులో మనసుకు ఒక లక్ష్యం నిర్ధేశించే క్రమంలో ఆటలు ఉంటాయి. ఆటలలో పేరు ప్రతిష్టలు సాధించినవారు ఎదిగే పిల్లలకు స్పూర్తిగా ఉంటారు.

ఇలాంటి ఆటలలో ఆడుతూ, మరొకరికి ఆదర్శవంతమైన కీర్తిని సాధించిన వారందరికి ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు.

నీవు పుట్టిన ప్రాంతానికి పేరు రావాలనే తలంపుతో అలుపులేని నీ పరుగు అందరికీ ఆదర్శవంతం…

నీకు నీ కుటుంబ సభ్యులకు ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు

జీవితం ఓ పరుగు పందెం అయితే అందులో గెలిచేది ఎవరు, ఒడేది ఎవరు? దేవునికెరుక కానీ నీవు సాధించే విజయం మరొకరిలో స్పూర్తిని నింపుతుంది.

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవము సందర్భంగా నీకు నీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు.

పెరిగే వయస్సులో మొదలైన నీ పరుగు, పెరిగాక విజయాల వైపుకు దూసుకుపోతుంది.. విజయం కోసం దూసుకువెళ్ళే నీ పట్టుదల మాకు స్పూర్తి…

ప్రపంచ అథ్లెటిక్స్ డే విషెస్…

గురికుదిరెతే గురువు బొమ్మైనా చాలు విద్య నేర్చుకోవడానికి… గురి చూసి నీవు ఛేదించే లక్ష్యం, లక్ష్యసాధనకు తపించే అందరికీ స్పూర్తి.

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా నీకు నీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు

ఎగిరెగిరి పడే మనసు, శరీరంతో దూకుడు సాధన చేసేటప్పుడు కుదురుగా కూర్చుంటుంది. అప్పుడే బౌతికంగా చేసే జంపింగ్ పందెంలో విజయం… నీ కృషి, పట్టుదల మాకు ఆదర్శం.

నీకు నీ కుటుంబ సభ్యులకు ప్రపంచ అథ్లెటిక్స్ డే విషెస్…

సాధన చేస్తే విజయం వరిస్తుందని… ప్రపంచ అథ్లెటిక్స్ నిరూపిస్తూనే ఉన్నారు… వారందరికి ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు…

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం World Press Freedom Day

మేడే విషెస్ కోట్స్ తెలుగు

కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో

శుభాకాంక్షలు తెలుగులో

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్

తెలుగులో వ్యాసాలు

తెలుగులో పిల్లల పేర్లు బ్లాగు

తెలుగులో సినిమా క్విజ్