ప్రియమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంట్లో భర్తకు భార్య అన్నీ తానై ప్రవర్తిస్తుంది. భర్త అవసరాలకు తగ్గట్టుగా నడుచుకోవడంలో భార్యను మంచిన బంధం ఉండదని అంటారు.

అంతలా భార్య, తన భర్తతో మమేకం అవుతుంది. మనసుని ఆక్రమించేసే, భార్యకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొన్ని తెలుగు కొట్స్.

భార్య అంటే భాదించే అని అభిప్రాయం నుండి భార్య అంటే ప్రేమించేది అనే బలమైన భావం ఏర్పడే అంతలా నన్ను ప్రేమించినా భార్యామణి…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రేమలేని చోట మనసు కరకుగా ఉంటుంది… ప్రేమతో నిండిపోయిన హృదయం మరొక కఠిన మనసును కదిలించగలదు… నిండైన ప్రేమకు ప్రతిరుపమా…

నీకు జన్మదిన శుభాకాంక్షలు…

నాలో సగం అని అన్నింటిలోనూ వాటా అడిగే నీవు ప్రేమించడంలో మాత్రం వంతులు వేయవు… నన్ను కట్టిపడేసిన నీ ప్రేమ నాకు అదృష్టం… ఓ నా అర్ధాంగి 

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

వాదులాడేవారు ఉంటారు, వంతులాడేవారు ఉంటారు… కానీ నీ వాదన, నీ వంతులు మన కాపురం కళకళలాడడానికి సాయం అవుతుంటే, అది మన అదృష్టం… నా ప్రియమైన భార్యామణికి

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నేస్తం లేకుండా నేనుండలేనని ఎప్పుడూ నాతో తోడుగా ఉండడానికి భగవంతుడు నాకు ఇచ్చిన వరం నీవు… నేస్తమైనా నా ప్రియమణి భార్యామణికి

పుట్టినరోజు శుభాకాంక్షలు.

సాధించడం సగం హక్కు అని భావించేవారు ఉండే కాలంలో కూడా ప్రేమించడమే పరిపూర్ణమని భావించే నీవు నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టం… 

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్