పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

స్నేహితుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు మనసుకు బలం అయితే, ఆప్తుల నుండి వచ్చే శుభాకాంక్షలు మరింత బలం.

మన పుట్టినరోజు కన్నా స్నేహితుని పుట్టినరోజు అంటే మరింత ఆనందంగా ఉంటుంది. మన పుట్టిన రోజు ఏదైనా సమస్య వలన జరుపుకోకపోయినా స్నేహితుడి పుట్టినరోజు గ్రాండుగా జరగాలని అనుకుంటాం…

మిత్రుడంటే మనసులో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చొరవతో ప్రవర్తిస్తాం… మిత్రుడిని అభినందనలతో ముంచెత్తుతాం…

ప్రియ మిత్రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కొట్స్ తెలుగులో…

మరల మరలా గుర్తుకు వస్తూ, మరుపురాని అనుబంధం మనమధ్య ఏర్పడింది… ఈ బంధం నీ మంచి మనసుకు చిహ్నం… నేస్తమా….

ప్రియ మిత్రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది… నీవు పుట్టగానే అమ్మకు, నాన్నకు ఆనందం అందించి, ప్రకృతిని పరిమిళింపజేసిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు….

భలే భలే మంచి రోజు, మా మిత్రుని పుట్టినరోజు, ఈ పుట్టిన రోజులాగానే సంవత్సరం అంతా సంతోషంగా సాగాలని కోరుకుంటూ…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

నీ పుట్టిన రోజు మాకు ఒక పండుగ రోజు వలె అనిపిస్తుంది. ప్రతిరోజూ నీకు మంచి జరగాలని ఆశిస్తూ… మిత్రమా…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

మంచివారు అందరికి మంచే చేస్తారు. తిరిగి వారికి మంచే జరుగుతుంది. మంచితనానికి మారురూపంగా కనిపించే ప్రియమిత్రమా నీకు

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

అద్బుతమైన ప్రజ్ణాపాఠవాలు కలిగిన నీవు నాకు స్నేహితుడుగా ఉండడం నా అదృష్టం. నేస్తమా… నీకు జన్మదిన శుభాకాంక్షలు.

పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు.

సంతోషం సగం బలం అయితే ఆనందం సద్బలం. అటువంటి ఆనందం పుడుతూనే బంధువులకు కలుగజేసిన నేస్తమా

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

పుట్టిన ప్రతివారు నేర్చుకుంటూ ఎదుగుతారు, నీవు నేర్చుకుంటూ మరొకరికి నేర్పుతూ అందరికీ మార్గదర్శకంగా మారిన మిత్రమా…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

పుట్టాక అమ్మానాన్నకు ఆనందం అయ్యావు. ఎదుగుతూ మాకు మంచిమిత్రుడు అయ్యావు. నీ మంచితనంతో మాపై కూడా మంచివారనే గుర్తింపు తెచ్చిన మిత్రమా…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు……

అదేరా… ఇదేరా… నేడు నీ పుట్టిన రోజు మిత్రమా…. నీలాంటి ఒకరి సహవాసం, నాలాంటి వారికి చక్కటి మేలుకొలుపు… అంతటి ఔన్నత్యం ఉన్న నేస్తమా నీకు…

పుట్టిన రోజు శుభాకాంక్షలు.

అంతులేని ఆలోచనకు స్నేహితుడు ఒక స్పీడ్ బ్రేకరు వంటివాడు… ఆలోచనను మళ్లించడంలో మిత్రుడు సాయపడతాడు. చెడు ఆలోచనలను మళ్లించేవాడు మంచి మిత్రుడు అయితే, నీ పరిచయం నా అదృష్టం…

…నేస్తమా నీకు జన్మదిన శుభాకాంక్షలు

సాయం చేసేవాడు, ఆదుకునేవాడు కంటే, హితము కోరేవాడే గొప్ప అయితే అందరి హితమును కోరుకునే నీ స్నేహం అందరికీ ఆదర్శం…

జన్మ దిన శుభాకాంక్షలు.

మిత్రమా నా ప్రియ మిత్రమా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మాయా ప్రపంచంలో అమాయకత్వంతో బ్రతకాలంటే ఎంతో స్థైర్యం ఉండాలి. నీకున్న పాజిటివ్ థింకింగ్ నీకు బలం. ఆ బలమే నిన్ను నమ్మకున్నవారికి శ్రీరామరక్ష.

ప్రియ మిత్రమా నీకు జన్మదిన శుభాకాంక్షలు

నీస్నేహం నాకు వరం అయ్యింది, అటువంటి వరపుత్రుడిని అందించిన మీ అమ్మానాన్నకు ధన్యవాదలు తెలుపుతూ ప్రత్యేకించి…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

నీ కన్నా నీ చుట్టూ ఉండేవారికి మేలు కలగాలనే తాపత్రయపడే మిత్రమా నీకు మరింత మేలు జరగాలని కోరుకుంటూ…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

ఆప్తులుగా ఎందరు ఉన్నా, స్నేహితుడు కోరే హితమే హితము…. నాపై స్నేహభావనతో ఆప్తుడుగా మారిన మిత్రమా…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

బెస్ట్ ఫ్రెండ్స్ సాయపడడంలో పోటీపడతారని నిరూపించిన నేస్తమా నీకు నాతరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు…

పరిచయస్తులంతా ఫ్రెండ్స్ కారు కానీ నీకు ఫ్రెండ్సే ప్రపంచం… ఓ మై ఫ్రెండ్ హ్యాపీ బర్త్ డే టు యు…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

ఓటమి నా చిరునామా అనుకుంటే, కాదు గెలుపు నీ గమ్యం అంటూ నాలో ధైర్యం నింపిన నేస్తమా నీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

దైవం స్నేహితుడి రూపంలో ఉంటుందని, నీ స్నేహం వలన తెలిసింది. నేస్తమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు…

ఆశించడం కన్నా ఆశయం కోసం పాటుపడడం గొప్ప అని భావించే, నీ ఆశయం నెరవేరలని కోరుకుంటూ నేస్తమా…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

మాట మనసుని తాకుతుంది, నీ మంచి మాటలు మనసులో మెదులుతూనే ఉంటాయి. ఓ మంచి మిత్రమా నీకు జన్మదిన శుభాకాంక్షలు.

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

కష్టంలో చిరునవ్వు చెరగకపోవడం అంటే ఆదుకునేవారు ఎప్పుడు అందుబాటులో ఉండడమే… నా చిరునవ్వుకు తెలుసు నీ ప్రాధాన్యత. కలకాలం చిరునవ్వుతో ఉండాలని ఆశిస్తూ…

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

1 thought on “పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో”

Leave a Comment