శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021... ఆగష్టు 30న కృష్ణాష్టమి సంధర్భంగా తెలుగులో శుభాకాంక్షల కొట్స్ చిత్రాలు…

కృష్ణుడు యొక్క లీలలు అద్భుతం. అమృతం వంటివి. ఒక్కసారి మనసుని తాకితే, ఆ మనసు గమ్యం గుర్తుకు వస్తుంది. ఒక్కసారి కృష్ణభక్తి కలిగితే, జీవితం ధన్యమవుతుంది అంటారు.

భగవంతుడి పరిపూర్ణుడుగా వచ్చి బాల్యం నుండే లీలలు చేసి అందరినీ ఆకట్టుకున్న అవతారం అంటే కృష్ణావతారం.

శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రోజున జన్మించిన కృష్ణుడు… దుష్ట శిక్షణ చేస్తూ… అమ్మను అలరిస్తూ, గోపాలారుతో ఆటలాడుకుంటూ… భక్తులను అనుగ్రహిస్తూ… చివరికి భగవద్గీతను బోధించాడు.

కలియుగంలో మనిషి తరించడానికి నామ స్మరణ చాలు అంటారు. నామ స్మరణ ఎప్పుడూ ఉండాలంటే, ఎప్పటికీ చెదరని లీలలు ఉండాలి. అటువంటి లీలలు మనసులో మెదులుతుంటే, నామము అదే వస్తుంది… బాల కృష్ణుడు ఎప్పటికీ అందరిలోనూ ఉంటూ… అందరినీ అనుగ్రహించడానికే చూస్తూ ఉంటాడని… అంటారు.

మనలోనే ఉంటూ మన మనసులతో దోబూచులాడేవాడిని…పట్టుకోవాలంటే, వాడు అడిస్తే ఆడే మనసు అసాధ్యమే అయితే…. ఆ మనిషికి వాడి అనుగ్రహమే సాయం చేయాలి అంటారు.

అమ్మకు తనకు తానుగా పట్టుబడినట్టు… అందరికీ అలానే పట్టు బడతాడని అంటారు.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా మా కన్నయ్యగా రారా కృష్ణయ్యా.. మా ఇంటికొచ్చి మమ్మానందింపజేయవయ్యా కృష్ణయ్యా…

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

నీభక్తికోసం తపించని హృదయం ఆగమ్యగోచరమైన మార్గంలో పయనించే మనసును కలిగి ఉన్నట్టు… అయినే నిన్ను భక్తితో తలిస్తే చాలు గమ్యం గోచరిస్తుంది… నీపుట్టినరోజునాడు అంతటా వ్యాపించి ఉన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు.

తరించాలంటే తనువు చాలించేలోగా నిన్ను చేరాలని చెబుతారు… అలాంటి నీవు అందరినీ అనుగ్రహించడానికే అవతరించావని అంటారు. అందరి నీ అనుగ్రహం లభించాలని కాంక్షిస్తూ… కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

ఇందుగలడనీ అందులేడని సందేహము వలదు… ఎందెందు వెదికినా అందందే గలడు అంటారే… మరి నామనసులో ఎందుకు లేవు? నా మనసుకు ఆధారమై, నాకు తెలియబడకుండా, నేటికీ నాపై లీలలు చూపుతున్న దేవ దేవా అందరినీ అనుగ్రహించు… నన్ను తరింపజెయి… కృష్ణభక్తులందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

అర్జునుడు జ్ఞాని అందుకే నీతోనే చెలిమి చేశాడు… జ్ఞానులు ఎక్కువగా ఉండే కాలంలో బోధ చేసి, అజ్ఞానులు ఎక్కువగా ఉండే కాలంలో మాత్రం మౌనంగా ఉంటూ అనుగ్రహిస్తున్న నా స్వామి ధన్యవాదలు… జనులందరికి. శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

హరుడు కృష్ణుడు అయితే మనోహరుడు. విష్ణువు కృష్ణుడు అయితే చక్రధారి. బ్రహ్మకృష్ణుడు అయితే బాలకృష్ణుడు… అందరి దేవతా స్వరూపాలకు మూలమైన నీవు సర్వ వ్యాపివి…

నిన్ను గ్రహించక మనసు మాయలో పడుతుంది. నిన్ను గ్రహించిన మనసు మాయను దాటుతుంది… అలాంటి నీవు అందరికీ తెలియబడాలి… అని ఆశిస్తూ… శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

తెలుగులో శుభాకాంక్షలు

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే