తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు

తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చతుర్థి సందర్భంగా స్నేహితులకు, బంధువులకు, తోటివారికి శుభాకాంక్షలు తెలుగులో తెలపడానికి తెలుగులో కొన్ని కొట్స్.

ఎవరి పండగ అంటే అందరికీ అమితానందం కలుగుతుందో అదే వినాయకచవితి పండుగ. ఎందుకు అందరికీ అంతటి ఆనందం అంటే?

చిన్ననాటి నుండి ఈ పండుగలో పాల్గొనడం అలవాటుగా ఉంటుంది. గుడి చుట్టూ తిరగడం, గుడి ముందు ఆటలు ఆదుకోవడం… వినాయక చవితి అనగానే మనసులో ఆనందం అనిపిస్తుంది.

ఇంకా చిన్న పిల్లలంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. అలాంటి వినాయక చవితి పండుగ అంటే అందరికీ ఇష్టమే. ఈ వినాయక చవితి సందర్భంగా బంధుమిత్రులకు, తోటి వారికి శుభాకాంక్షలు తెలియజేసి పండుగ జరుపుకుందాం….

తెలుగులో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు కోట్స్

తల తెంచిన తండ్రికి ఎప్పుడూ దగ్గరగా ఉండే మన బొజ్జగణపయ్య అనుగ్రహం అందరిపై వర్షం కురిసినట్టు కురవాలని కోరుకుంటూ…

…వినాయక చవితి శుభాకాంక్షలు.

అమ్మ కడుపులో పెరగలేదు కానీ అమ్మ మాట అంటే జవదాటని మన బాలగణపతి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆశిస్తూ….

….మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

ఏనుగు ముఖం గలవాడా నీ అనుగ్రహానికి ఎల్లలు ఉండవు. గజాననుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ…

…వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

వినాయకుడు అనుగ్రహం ఉంటే, పనులలో ఆటంకం కలగదు. ఆ వినాయకుడి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్ధిస్తూ…

మీకు మరియు మీ బంధు మిత్ర పరివారానికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

ప్రారంభానికి ముందు వినాయక పూజ తప్పదు, విఘ్నేశ్వరుడి పూజకు కూడా వినాయకుడి అనుగ్రహమే కావాలి… విఘ్నం లేకుండా అందరూ వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ.

తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు..

పదహారు సుగుణాలు గల ఈశ్వరుని కుమారునికి పదహారు నామాలు అంటే ఇష్టం… ఆ పదహారు నామాలు ప్రతిరోజూ వినాలంటారు… “సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః”

మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు మరియు మీ మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

ఎలుక వాహనం గలవాడు, ఏనుగు ముఖం గలవాడు, పెద్ద బొజ్జగలవాడు, పార్వతి పరమేశ్వరులకు పెద్ద కొడుకు…. కానీ ఆ కుటుంబంలో అందరికీ ఆయనంటే పరమప్రీతి. అటువంటి వినాయకుడి అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తూ…

వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

పది క్షణాలు చూస్తే చాలు మనసులో మెదులుతూనే ఉంటాడు… మన బొజ్జ గణపయ్య… ఇక వినాయక చవితి రోజు పూజ చేస్తే, సంవత్సరం అంతా ప్రతి పనికి ముందుగా ఆ గణేశుడే గుర్తుకు వస్తాడు…

…వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుగులో

అక్షరాభ్యాసం అయినా ఉపదేశం అయినా గణేషుడి కరుణ తప్పకుండా కావాలి. సంవత్సరం అంతా మీ పనులకు ఆటంకం కలగకుండా కొనసాగే విధంగా ఆ గణేశుడు మిమ్మందరిని అనుగ్రహించాలని ఆశిస్తూ…

…మీకు మరియు మీ బంధు మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

సుకృతం ఉంటే సుఖవంతమైన జీవితం… కానీ వినాయకుడి అనుగ్రహం అటువంటి సుకృతములు ఎన్నో చేయవచ్చు అంటారు… అటువంటి వినాయకుడి అనుగ్రహం అందరికీ కాగలని ఆశిస్తూ…

అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

తెలుగులో శుభాకాంక్షలు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 2021

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే